డిఎస్ కు ఢిల్లీ పదవా, రిటైర్మెంటా, మొయిలీ మాటలు ఉత్తవేనా?

Srinivas
న్యూఢిల్లీ: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడి ఎంపిక త్వరలోనే జరుగుతుందని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ అన్నారు. అయితే, ఆయన మాటల్లో నిజం లేదనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర వ్యవహారాల నుంచి ఇప్పటికే కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ వీరప్ప మొయిలీని పక్కకు తప్పించారని చెబుతున్నారు. వ్యవహారాలను సోనియా, ఆమె రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ చూస్తున్నారని తెలుస్తోంది. ఎఐసిసి రాష్ట్రాల ఇంచార్జీల నియామకం జరిగే వరకు పిసిసి మార్పు జరగదనే మాట వినిపిస్తోంది. ఒకవేళ, పిసిసి అధ్యక్షుడిగా కొత్తవారిని నియమిస్తే డి. శ్రీనివాస్ భవిష్యత్తు ఏమిటనేది కూడా చర్చ జరుగుతోంది. డిఎస్ కు ఢిల్లీ స్థాయిలో ఏదైనా పదవి ఇస్తారా, లేదా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. లేదంటే ఆయన రిటైర్ అవుతారా అనేది కూడా ప్రశ్నగానే మిగిలింది. రాజకీయాలను తన కుమారుడికి అప్పగించి, ఆయన రిటైర్ అవుతారనే ప్రచారం జరుగుతోంది.

పిసిసి అధ్యక్షుడి నియామకం ఏ ప్రాతిపదికపై జరగాలనే విషయంపై చర్చ సాగుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిణామాలు, తెలంగాణ అంశంతో పీసీసీ అధ్యక్ష పదవి ముడిపడి ఉన్నందున సుదీర్ఘ చర్చలు జరుగుతున్నాయని చెప్పాయి. అదే సమయంలో, రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, పీసీసీకి కొత్త నేతను ఇప్పుడే నియమించాలా? లేక డిసెంబర్‌లో జరిగే ప్లీనరీలోపు నియమించాలా!? అన్న విషయంపైనా చర్చలు సాగుతున్నాయి. దీనికి సంబంధించి గురువారమే ఒక స్పష్టత వస్తుందని ఆ వర్గాలు తెలిపాయి. ఎవరిని నియమించాలన్న విషయంపై ఒక స్పష్టత ఏర్పడితే ఈనెల 30వ తేదీలోపే పీసీసీకి కొత్త అధ్యక్షుడిని నియమించవచ్చని, లేకపోతే డిసెంబర్ 15 తర్వాతే పేరును ప్రకటించవచ్చని పార్టీ వర్గాలంటున్నాయి. డీఎస్ స్థానంలో నియమించే నాయకుడు ఎవరికీ జంకకుండా, ఏ ప్రలోభాలకూ లొంగకుండా అధిష్ఠానానికి విధేయుడై, క్రమశిక్షణా రాహిత్యాన్ని అణిచేసే వ్యక్తి అయి ఉండాలని అధిష్ఠానం భావిస్తోంది. అదే సమయంలో, పీసీసీ అధ్యక్షుడి నియామకం ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో తన పట్టును మరింత బిగించాలని, భవిష్యత్తు పరిణామాలపై స్పష్టత ఇవ్వాలని భావిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+