ముఖ్యమంత్రి రోశయ్యను తప్పుకోమన్న గోనె ప్రకాశ్ రావు

రోశయ్యకు పాలన చేతకావటం లేదని, పార్టీని, ప్రభుత్వాన్ని గాలికి వదిలేశారన్నారు. గ్రహపాటునో పొరబాటునో ముఖ్యమంత్రినయ్యానని ఆయన అసమర్థతని చాటుకున్నారన్నారు. రోశయ్యకు చేతకాకుంటే తప్పుకోవాలి కాని కాంగ్రెసు భవిష్యత్తును నాశనం చేయరాదని సూచించారు. భవనం వెంకట్రాం కంటే ఎక్కువ రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఇక చాలని అన్నారు. ఏనాడూ ముఖ్యమంత్రిని కావాలని కోరుకోలేదన్న నీవు సంవత్సరానికి పైగా ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఆ కోరిక లేనప్పుడు ఇప్పటికీనా తెలంగాణ వారికి ఆ పదవిని ఇచ్చి సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచించవచ్చు కదా అన్నారు.












Click it and Unblock the Notifications