చిరంజీవికి మరో దెబ్బ: పార్టీకి గొట్టిముక్కల పద్మారావు రాజీనామా

వ్యవస్థలో మార్పు తీసుకువస్తానన్న చిరంజీవే రాజకీయ రంగం నుంచి సినిమా రంగంలోకి మారుతున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేకుండా ఏర్పాటు చేసే పార్టీలకు ఇదే పరిస్థితి ఎదురవుతుందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల ఓట్లు దండుకోవడానికి సామాజిక తెలంగాణ అన్న చిరంజీవి తెలంగాణ ఏర్పాటుకు కేంద్రం సమ్మతించగానే ప్లేటు ఫిరాయించి, సమైక్యాంధ్ర నినాదం అందుకోవడం ఏ సిద్ధాంతం కిందకు వస్తుందని ఆయన ప్రశ్నించారు. గొట్టిముక్కల పద్మారావు త్వరలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరనున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications