బాబుపై అలిపిరి దాడి: మావోయిస్టు నేత సాగర్, నలుగురు దోషులు

చంద్రబాబుపై క్లైమోర్ మెన్ దాడి కేసులో 76 మంది సాక్షులను కోర్టు విచారించింది. ఈ కేసులో మొత్తం 33 ముద్దాయిలున్నారు. ఈ దాడి నక్సలైట్లు చేసిందిగా కోర్టు తీర్పునిచ్చింది. అయితే నిందితుడు సాగర్ నక్సలైట్ అనడానికి గానీ, నక్సలైట్ కాదు అనడానికి గానీ ఎలాంటి రుజువులు లేవు. 76 మంది సాక్షులు కూడా సాగర్ అక్కడ ఉండటాన్ని గమనించాము. కాని ఆయనే కారణమని ఎవరూ చెప్పలేదు. దీంతో సాగర్ తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. 33 మంది ముద్దాయిల్లో ఎన్ కౌంటర్ పేరుతో ఇప్పటికే 9 మందికి పైగా చనిపోయారు.
చంద్రబాబుపై దాడి జరిగినప్పుడు ఆయనతో పాటు బొజ్జల గోపాలకృష్ణయ్య, చదలవాడ కృష్ణమూర్తి, రాజశేఖర్ రెడ్డికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఆ సంఘటన చూసిన ఎవరూ కూడా ఆ ఘటనలో చంద్రబాబుతో పాటు వారెవరూ కూడా బ్రతికి ఉండరనే అనుమానం వ్యక్తం చేశారు. కాని వారు బతికి బయటపడ్డారు. చంద్రబాబు, బొజ్జల, చదలవాడ ఆ వేంకటేశ్వరుడి దయవల్లనే బతికి బయట పడ్డామని ఇప్పటికీ చెబుతుంటారు. అయితే సాగర్ కు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం లేక పోవటంతే కేసు కొట్టివేయబడుతుందని అందరూ అనుకున్నారు. అయితే అనుకోని విధంగా కోర్టు నిందితులకు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో తమకు న్యాయం జరగలేదని, సాగర్ తో పాటు మిగిలిన నిందుతులకు ఈ ఘటనలో పాత్ర లేదని సాగర్ తరఫు న్యాయవాది అన్నారు. సెషన్సు కోర్టు తీర్పును విభేదిస్తూ మేం అప్పీలుకు వెళతామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications