చంద్రబాబుకు తెలంగాణ నేతల ఢిల్లీ నేతల ఢిల్లీ యాత్ర కష్టాలు

తెలంగాణపై ఆ ప్రాంత నాయకులు వ్యక్తం చేస్తున్నది వారి వ్యక్తిగతాభిప్రాయం మాత్రమేనని, అది పార్టీ అభిప్రాయం కాదని ఆయన స్పష్టం చేశారు. దీంతో తెలంగాణ నేతలు భగ్గుమన్నారు. చంద్రబాబు అనుమతితోనే తాము ఢిల్లీ యాత్ర చేపట్టామని చెప్పిన తెలంగాణ ప్రాంత నాయకుడు నాగం జనార్దన్ రెడ్డికి కోడెల శివప్రసాద రావు ప్రకటన విరుగుడుగా పనిచేసింది. దీంతో తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని చూరగొనడానికి తలపెట్టిన ఢిల్లీ యాత్ర వ్యతిరేక ఫలితాలు ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. దీంతో తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకుడు రేవంత్ రెడ్డి కోడెల శివప్రసాద రావుపై మండిపడ్డారు. తాము చంద్రబాబు అనుమతితోనే ఢిల్లీ యాత్ర చేపట్టామని, పార్టీ అనుమతి లేకుండా అంత పెద్ద కార్యక్రమం ఎలా చేపడుతామని ఆయన అన్నారు.
కాగా, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్లమెంటు సభ్యురాలు రాములమ్మ చేసిన ప్రకటన తెలుగుదేశం పార్టీ తీరును బయటపెట్టేదిగా ఉంది. ఇప్పుడు తెలంగాణ నేతలను ఢిల్లీకి పంపిన చంద్రబాబు రేపు సీమాంధ్ర నాయకులను పంపుతారని, చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని విజయశాంతి అన్నారు. ఈ విషయంలో రాములమ్మ ప్రకటనకే ఎక్కువ విశ్వసనీయత ఉంటుందనడంలో సందేహం లేదు.












Click it and Unblock the Notifications