హైదరాబాదులో యువతిపై ప్రేమోన్మాది దాడి: ఆత్మహత్యాయత్నం
Districts
oi-Srinivas G
By Srinivas
హైదరాబాద్: హైదరాబాద్ లోని కూకట్ పల్లి సమీపంలోని జగద్గీర్ గుట్టలో ఓ ప్రేమోన్మాది ఓ అమ్మాయిపై బ్లేడుతో దాడి చేసి తాను ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. నాగరత్నం అనే అమ్మాయిని మద్దిరెడ్డి నర్సారెడ్డి అనే వ్యక్తి గత కొద్దికాలంగా ప్రేమిస్తున్నాడు. నర్సారెడ్డి ఆటో డ్రైవర్. అయితే ఆమె ప్రేమకు ఒప్పుకోక పోవటంతో శుక్రవారం ఉదయం ఆమెపై బ్లేడుతో దాడి చేశాడు. చేతులను, గొంతును కోశాడు. ఆ తర్వాత అతడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పూనుకున్నాడు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు.