స్టూడియోఎన్ లోకేష్ పై దండెత్తిన తెలంగాణ ఉద్యమకారులు

తెలంగాణ గురించి మాట్లాడేవారిని ఉద్యోగాల నుంచి తొలగించారని, అది తెలంగాణ ఉద్యమంపై దాడిగానే తాము పరిగణిస్తున్నామని తెలంగాణ జెఎసి కన్వీనర్ కోదండరామ్ అన్నారు. అందుకు చంద్రబాబు బాధ్యత వహించాలని ఆయన అన్నారు. అక్రమ సంపాదనతో స్టూడియోఎన్ ను స్థాపించారని, ఆ అక్రమ సంపాదనలో తమ ప్రాంత ఉద్యోగులు వాటాను కోరడం లేదని తెలంగాణ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు స్వామి గౌడ్ అన్నారు. లోకేష్ పై, చంద్రబాబుపై, స్టూడియోఎన్ యజమాని నార్నే శ్రీనివాస రావుపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉద్వాసనకు గురైన ఉద్యోగులు ఆందోళన చేస్తుంటే యాజమాన్యం కనీసం చర్చలకు కూడా ఆహ్వానించడం లేదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ అన్నారు. చంద్రబాబు విధానాలపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.












Click it and Unblock the Notifications