కెసిఆర్ వాఖ్యలను సమర్థించిన దానం నాగేందర్, ముఖేష్ గౌడ్
State
oi-Srinivas G
By Srinivas
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతంగా అంగీకరించమని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు చేసిన వాఖ్యలను తాను అంగీకరిస్తున్నట్టు ప్రాధమిక వైద్య ఆరోగ్య శాఖమంత్రి దానం నాగేందర్ ఆదివారం విలేకరులతే అన్నారు. తెలంగాణ ఇస్తామన్నా, హైదరాబాద్ ను రాష్ట్రంగా ప్రకటిస్తామన్నా, మరే విధంగా ప్రపోజల్ చేసినా తాము సమర్థిస్తామని కానీ కేంద్రపాలిత ప్రాంతానికి మాత్రం అంగీకరించేది లేదన్నారు. ఇప్పటికే హైదరాబాద్ బాగా పెరిగిందని, ఇలాంటి హైదరాబాదును నాయకులు లేని రాజ్యంగా చేస్తే ఎలా అని అన్నారు. కేంద్రపాలిత ప్రాంతాలే రాష్ట్రాలుగా మారుతున్న ఈ సమయంలో రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేయడమేమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గోనె ప్రకాశ్ రావు చేసిన వాఖ్యలు తాను పట్టించుకోనని ఆయన ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు.
హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తామంటే మే ఊరుకోమని మరే మంత్రి ముఖేష్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటే చేస్తే సమర్థిస్తాం. కాని యుటికి మాత్రం ఒప్పుకోమన్నారు.