వేడుకలు రద్దు చేయాలంటూ సిఎం ఇంటిని ముట్టడించిన ఓయు జేఏసి
State
oi-Srinivas G
By Srinivas
హైదరాబాద్: నవంబర్ 1వ తేదిన రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని తెలంగాణలోని పది జిల్లాల్లో రద్దు చేయాలని కోరుతూ హైదరాబాద్ లోని ముఖ్యమంత్రి ఇంటిని ఉస్మానియా యూనివర్శిటీ ఐక్య కార్యాచరణ సమితి విద్యార్థులు ముట్టడించడానికి ప్రయత్నించారు. వెంటనే ముఖ్యమంత్రి నవంబర్ 1 ని రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఆ రోజుని విద్రోహ దినంగా పాటించాలని కోరారు. ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ముఖ్యమంత్రి ఇంటిముందు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అప్పటికే భారీగా పోలీసులను మోహరించారు. పోలీసలు ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడించిన విద్యార్థులను అడ్డుకున్నారు. పరిస్థితి విషమంగా తయారవడంతో వారిని అరెస్టు చేశారు.