గీతారెడ్డి ఇల్లు ముట్టడి, అరెస్టులు: తెలంగాణవ్యాప్తంగా నిరసనలు

హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కళాశాల భవనంపై విద్యార్థులు నల్లజెండాను ఆవిష్కరించారు. గోదావరి ఖనిలోని సింగరేణి బొగ్గు గనుల కార్యాలయంపై కూడా కార్మికులు నల్లజెండాను ఎగురవేశారు. రాష్ట్రావతరణ దినోత్సవాలను వ్యతిరేకిస్తూ ప్రజాఫ్రంట్ చైర్మన్ గద్దర్ జగ జీవన్ రామ్, అంబేడ్కర్ విగ్రహాల వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. తెలంగాణ అంతటా విద్యాసంస్థలకు యాజమాన్యాలు స్వచ్ఛందంగా సెలవులు ప్రకటించాయి. తెలంగాణ అంతటా రాష్ట్రావతరణ దినోత్సవాలు వెలవెలబోతున్నాయి.












Click it and Unblock the Notifications