అనుష్కతో పాటు ప్రముఖుల ఇళ్లపై రాళ్ల దాడులు: అరెస్టు

కొంత మంది ఆకతాయిలు గత నెల రోజులుగా ప్రముఖులు, సంపన్నులు నివసించే జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ ల్లోని ప్రముఖుల ఇళ్లపై రాళ్లతో, కోడిగుడ్లతో దాడులు చేస్తున్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదులు కూడా అందాయి. దీంతో పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. నిఘా సందర్భంగా నిందితులను గుర్తించి పట్టుకున్నారు. ఆ ప్రాంతాల్లో వెళ్లే ద్విచక్రవాహనదారులపై కూడా వారు దాడులు చేయడం పరిపాటిగా మారింది. ఆర్ధరాత్రి ఈ ఆకతాయిలు దాడులకు దిగుతున్నారు. తమ కార్ల నెంబర్ ప్లేట్లపై తెల్ల కాగితాలు అతికించుకుని వీరు దాడులకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.












Click it and Unblock the Notifications