వైయస్ జగన్ రూట్ క్లియర్: హైకమాండ్ పై అంబటి తీవ్ర వ్యాఖ్యలు

కాగా యువజన కాంగ్రెస్ లో పదవుల కోసం బేరాలు జరిగాయని ఆయన అన్నారు.మంత్రులకు క్యారెక్టర్ లేదన్ని ముఖ్యమంత్రి వాఖ్యలు పార్టీ ప్రతిష్టను దిగజార్చుతున్నాయి. ఎమ్మార్ సమాచారం శాసనసభ్యుడు డిఎల్ రవీంద్రారెడ్డికి ఇచ్చి మాట్లాడించింది రోశయ్యేనని ఆయన విమర్శించారు. డిఎల్ రవీంద్రారెడ్డి చేత సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేయించింది కూడా రోశయ్యేనని ఆయన అన్నారు. టాలెంట్ హంట్ ద్వారా యువజన కాంగ్రెసు పదవుల నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. టాలెంట్ హంట్ పేరుతో వైయస్ రాజశేఖర రెడ్డి, వైయస్ జగన్ అభిమానులను పదవులకు దూరం చేస్తున్నారని ఆయన విమర్శించారు












Click it and Unblock the Notifications