మాకొద్దీ మైక్రో రుణాలు: చంద్రబాబుతో మైక్రో బాధితుల మొర

సూక్ష్మ బాధితుల కోసమే తెలుగు దేశం శనివారం నుండి ఆందోళనలు నిర్వహించనుందని చెప్పారు. తమకు ఫీజు రీయింబర్స్ మెంటులు కూడా అందడం లేదని కొందరు విద్యార్థులు చంద్రబాబుతో మొరపెట్టుకోగా ఆ విషయమై ప్రభుత్వంతో పోరాడుతానని చెప్పారు. ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు తెదేపా పోరాడుతుందన్నారు. ప్రభుత్వానికి అన్నివైపులనుండి ఆదాయం పెరిగినప్పటికీ ప్రజల సమస్యను మాత్రం పట్టించుకోవటం లేదన్నారు. అవినీతి పరులకు కొమ్ముకాయడానికే సమయం సరిపోతుందని ఎద్దేవా చేశారు.
కాగా అంతకుముందు శామీర్ పేటకు వస్తున్న చంద్రబాబునాయుడిని తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు, పోలీసులు వారిని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారు చంద్రబాబు కారుకు అడ్డుగా నిలబడి వెళ్లనీయక పోవటందో టీడీపీ, తెరాసల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్త ముదిరి ఘర్షణకు దారి తీసింది. పోలీసులు తెరాస కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications