వరద బాధితులను ఆదుకుంటాం: ఏరియల్ సర్వే అనంతరం సిఎం

తక్షణ సహాయక చర్యలకు మూడు జిల్లాల కలెక్టర్లను, అధికారులను ఆదేశించానని చెప్పారు. బాధితులకు 20 కిలోల బియ్యం, 5 లీటర్ల కిరోసిన్ అందజేస్తామన్నారు. గత సెప్టెంబరులో ఇలాంటి విపత్తే వచ్చిందని, వెంటనే ప్రభుత్వం స్పందించిందని గుర్తు చేశారు. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ నిపుణులు సూచించినప్పటికీ దానిని ఖచ్చితంగా ఇంకా చెప్పలేదన్నారు. అయినప్పటికీ ప్రజలకు అప్రమత్తం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం, అధికారులపైన ఉన్నదన్నారు. కోతకు వచ్చిన పంటలు నీళ్లలో మునిగి పోవటంతో రైతులు ఆవేదన చెందుతున్నారన్నారు. ప్రభుత్వం వారికి నష్ట పరిహారాన్ని ఇస్తుందన్నారు. ఆర్ అండ్ బి రహదారులకు నివేదిక తీసుకొని మార్పులు చేస్తామన్నారు.
కాగా ముఖ్యమంత్రి రోశయ్యను కలవడానికి వచ్చిన తెలుగు దేశం పార్టీ నాయకులను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. అందులో దేవినేని ఉమ ఉన్నారు. పంట నష్టం గురించి తాము ముఖ్యమంత్రికి నివేదిక ఇవ్వడానికి వెళితే పోలీసులు అరెస్టు చేయటం సిగ్గుచేటని దేవినేని ఉమ అన్నారు.












Click it and Unblock the Notifications