కెసిఆర్ నిరాహార దీక్షపై బండారం బయట పడుతుంది: నాగం జనార్దన్ రెడ్డి

కెసిఆర్ పై తెలుగుదేశం తెలంగాణ ప్రాంతానికి చెందిన మరో నేత కడియ శ్రీహరి కూడా తీవ్రంగా ధ్వజమెత్తారు. తెరాస, కాంగ్రెసు కమ్మక్కయి తెలుగుదేశం పార్టీని బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. చంద్రబాబు తెలంగాణకు వ్యతిరేకమని చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు. కెసిఆర్ ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని, సిగ్గు లేకుండా తెరాస కార్యకర్తలు దాడులు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెసువారిని కెసిఆర్ ఎప్పుడైనా నిలదీశారా అని ఆయన ప్రశ్నించారు. శ్రీకృష్ణ కమిటీ తెలంగాణకు అనుకూలంగా నివేదిక ఇస్తుందనే నమ్మకం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications