తెలంగాణలోనే వచ్చే శాసనసభ సమావేశాలు: కె తారకరామారావు

K Tarakarama Rao
హైదరాబాద్: వచ్చే శాసనసభ సమావేశాలు తెలంగాణలోనే జరుగుతాయని తెలంగాణ రాష్ట్ర సమితి నేత, సిరిసిల్ల శాసనసభ్యుడు కె తారకరామారావు అన్నారు. శాసనసభలో అడుగు పెట్టవద్దనే అధికారం ఎవరికీ లేదన్నారు. ఈసారి శాసనసభను తెలంగాణ నినాదాలతో హోరెత్తిస్తామని చెప్పారు. తెలంగాణను అడ్డుకుంటున్న సీమాంధ్రులకు బుద్ది చెబుతామని ఆయన అన్నారు.

తెలుగుదేశం హయాంలో వ్యవసాయాన్ని పక్కన పెట్టిన చంద్రబాబునాయుడు ఇప్పుడు రైతుల గురించి మొసలి కన్నీరు కార్చడం విడ్డూరమన్నారు. ఆయనకు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు. ఆయన హయాంలోనే ఎక్కువ రైతుల ఆత్మహత్యలు జరిగాయని గుర్తు చేశారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించని చంద్రబాబు తెలంగాణలో పర్యటించడం విడ్డూరమన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+