ఒబామా పర్యటన భారత ఔట్ సోర్సింగ్ కు నిరాశనే

ఒబామా అధికారం చేపట్టిన కొన్నాళ్లకు అవుట్ సోర్సింగ్ వల్ల ఆమెరికా యువతకు ఉద్యోగాలు లేకుండా పోతోందని భావించిన ఒబామా అమెరికా మంచి భవిష్యత్తు కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పదని అవుట్ సోర్సింగ్ పై కఠిన నిబంధనలు విధించారు. దీంతో ఎఫెక్టు చాలా దేశాల్లో పడినప్పటికీ అవుట్ సోర్సింగ్ పైనే ఆధారపడ్డ భారత్ లోని బెంగుళూరు, ముంబయి వంటి వాటిపై భారీగా పడింది. కొన్నాళ్ల క్రితం ఒబామా బెంగుళూరుపై తన కోపాన్ని కూడా ప్రదర్శించాడు. అమెరికా కంపెనీలు ఇక్కడి యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా బెంగుళూరులోని వారికి ఉపాధి కల్పిస్తున్నాయని ఆయన వాఖ్యానించారు. ఆయన పలుమార్లు అమెరికా విశ్వవిద్యాలయాల్లో మాట్లాడుతూ బెంగుళూరు, బీజింగులతో పోటీ పడాలని తమ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఒబామా భారత్ కు ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలిలో కూడా శాశ్వత సభ్యత్వంపై నిర్దిష్టమైన హామీ ఇవ్వలేదు. ఆయితే దానిపై చర్చిస్తానని మాత్రం చెప్పారు. అంతే కాకుండా భారత్ - అమెరికా ఎదుర్కొంటున్న ఉగ్రవాదం, పర్యావరణం పై కలిసి పనిచేస్తామని చెప్పారు. ఆర్థిక సహకారం, అభివృద్ధికి ఇరు దేశాలు కలిసి పని చేసే విధంగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఆసియా - అమెరికా సంబంధాలు గట్టిపడాలంటే ఆసియాలో ఉన్న ముఖ్యదేశం భారత్ తో మా సంబంధాలు బాగుండాలన్నారు.












Click it and Unblock the Notifications