Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంద్రబాబు, రామోజీ, విహెచ్ లపై సాక్షి డైలీ అటాక్

Sakshi
హైదరాబాద్: మైక్రో ఫైనాన్స్ సంస్థల ఆగడాలకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఈనాడు దినపత్రిక అధిపతి రామోజీ రావు, తమ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వి. హనుమంతరావులను తప్పు పడుతూ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు చెందిన సాక్షి డైలీ సుదీర్ఘ వార్తాకథనాన్ని ప్రచురించింది. ఈ ముగ్గురి వల్లనే మైక్రో ఫైనాన్స్ సంస్థల ఆగడాలు పెచ్చరిల్లాయని ఆరోపించింది. ఎవరైతే రాష్ట్రంలో మైక్రోసంస్థల పుట్టుకకు కారణమయ్యారో, ఎవరైతే ప్రపంచ బ్యాంకు స్ఫూర్తితో మైక్రోల ఎదుగుదలను విపరీతంగా ప్రోత్సహించారో, ఎవరైతే తన హెరిటేజ్ సంస్థను కూడా మైక్రో వ్యాపారంలో పెట్టి కోట్లు దండుకోవాలనుకున్నారో, ఎవరైతే పావలా వడ్డీ వంటి పథకాలు ఆలోచించక ఊకదంపుడు ఉపన్యాసాలకే పరిమితమయ్యారో ఆ చంద్రబాబునాయుడే ఇప్పుడు ఊళ్లలో తిరుగుతూ మైక్రోల రుణాలు చెల్లించవద్దంటూ పిలుపునిస్తున్న తీరు రాజకీయవర్గాలను, ఆర్థికవేత్తలను విస్తుగొలుపుతోందని వ్యాఖ్యానించింది. ఒకవైపు విపక్షనేత చంద్రబాబునాయుడు, మరోవైపు కాంగ్రెస్ ఎంపీ, ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు, ఇంకోవైపు రామోజీరావు - ఇలాంటి పెద్ద తలకాయల మద్దతు ఉంది కాబట్టే మైక్రోలకు రాష్ట్రంలో ఆడింది ఆటలాగా మారిందని ఆరోపించింది. వ్యక్తులు వేర్వేరైనా, ఆర్థిక వ్యవహారాల విషయానికి వచ్చేసరికి ముగ్గురూ బంధువుల మాదిరిగానే వ్యవహరిస్తున్నారని, మొదట్లో ఎస్‌కేఎస్ అధినేత ఆకుల విక్రమ్ తన బంధువేనని విపక్షాలు ఎంత విమర్శించినా కిమ్మనని వీహెచ్ ఇప్పుడు గత్యంతరం లేక తన మనువడేనని ఒప్పుకున్నారు కూడా సాక్షి డైలీ వ్యాఖ్యానించింది. సాక్షి దినపత్రిక వార్తాకథనం ఇలా కొనసాగింది-

కేంద్రంలో చంద్రబాబు చక్రం తిప్పిన సమయంలోనే మైక్రో సంస్థలకు అనుమతులు ఇవ్వడంపై ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. అదే సమయంలోనే రాష్ట్రంలో కూడా పుట్టగొడుగుల్లాగా అనేక సంస్థలు పుట్టుకొచ్చాయి. షేర్ మైక్రోఫైనాన్స్ సంస్థ ఆర్‌బీఐ నుంచి 20 ఏప్రిల్ 1999న అనుమతి పొందగా, ఎస్‌కేఎస్ సంస్థ 22 సెప్టెంబర్ 2003న, స్పందన స్ఫూర్తి 10 మార్చి 2003న, నిర్మల్ సంస్థ 3 జనవరి 1995న అనుమతులు పొందాయి. ఇతర మైక్రో సంస్థలదీ ఇదే దారి. తన హయాంలో చంద్రబాబు తమను బాగా ప్రోత్సహించారంటూ సాక్షాత్తూ ఆ మైక్రో సంస్థల సంఘమే విలేకరుల సమావేశంలో కుండ బద్దలు కొట్టింది కూడా! తన హెరిటేజ్ సంస్థను ఏకంగా మైక్రో వ్యాపారంలో దింపాలనీ బాబు ఆశపడ్డారు. అయితే తాను పాలుపోసిన ఆ మైక్రో సర్పాల విషకోరలకు వరుసగా మహిళలు బలవుతుంటే... ఇప్పుడు అకస్మాత్తుగా తనకు అలవాటైన రీతిలో ప్లేటు ఫిరాయించారు. అసలు మైక్రో అనే పదమే వినలేదంటూ విడ్డూరంగా మాట్లాడుతున్నారు. అంతేకాదు; అసలు రుణాలు తిరిగి చెల్లించవద్దంటూ పిలుపునిస్తున్నారు. ఇది బాబు ద్వంద్వ వైఖరికి అద్దంపడుతోంది. తాను అధికారంలో ఉన్న తొమ్మిదేళ్ల కాలంలో పదుల సంఖ్యలో మైక్రో సంస్థల ఏర్పాటుకు కారణమైన బాబు.... ఆ సంస్థలు రుణాలిచ్చేందుకు పొదుపు సంఘాలను ఏర్పాటుచేశారు. 2009 ఎన్నికలకు ముందు బ్యాంకులకు పావలా వడ్డీ రుణాలను చెల్లించవద్దంటూ ఆయన పిలుపునిచ్చారు. ఈ దెబ్బకు బ్యాంకులు రుణాలు ఇవ్వడంపై నిర్లక్ష్యాన్ని కనబరచడం మొదలు పెట్టాయి. దీంతో దేశంలోనే ముందంజలో ఉన్న మన డ్వాక్రా ఒక్కసారిగా గాడి తప్పినట్లయింది. ఎప్పుడైతే డ్వాక్రాలకూ బ్యాంకులకూ నడుమ లింకేజీ తగ్గిపోయిందో... ఇక బాబు ఆశించినట్లే మైక్రోలు పల్లెల్లో విజృంభించాయి. ఇప్పుడదే నాయకుడు రుణాలు తిరిగి చెల్లించవద్దంటూ పల్లెల్లో తిరుగుతూ సన్నాయి నొక్కులు నొక్కుతుండటమే అసలైన విడ్డూరం!

వీహెచ్, చంద్రబాబు, రామోజీ... మైక్రో సంస్థలతో ఆర్థిక బంధాలు పెనవేసుకున్న ఇలాంటి పెద్ద తలకాయల కారణంగానే ప్రస్తుత ప్రభుత్వమూ మైక్రోల ఆగడాలపై సరైన రీతిలో స్పందించలేకపోతోంది. ఈనాడులో పెట్టుబడులు పెట్టిన కంపానీ సంస్థయే.... స్పందన మైక్రో సంస్థలోనూ పెట్టుబడులు పెట్టింది. మైక్రో దారుణాలకు ఒకవైపు పదుల సంఖ్యలో పేద ప్రజలు చనిపోతున్నా... ఊళ్లకు ఊళ్లు ఖాళీ అవుతున్నా వ్యవస్థల గురించి నోరు విప్పని వీహెచ్... మైక్రో సంస్థలకు రుణాలు చెల్లించవద్దంటే మాత్రం వ్యవస్థ నాశనం అవుతోందని గగ్గోలు పెడుతున్నారు. ఎస్‌కేఎస్ సంస్థ తన మనువడిది కావడమే దీనికి కారణం. ఈ పెద్ద తలకాయలు ఉన్న శిబిరాలు వేరైనా, మైక్రోల విషయానికొచ్చేసరికి ఆర్థిక బంధువులే! అందుకే... ప్రభుత్వం మైక్రోలపై కఠినంగా వ్యవహరించటానికి వెనకాముందాడుతోంది. ఒకవైపు వడ్డీపై నియంత్రణ విధిం చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందంటూ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) స్పష్టంగా ఆదేశాలు వెలిబుచ్చిన తర్వాత కూడా వడ్డీపై ఎలాంటి ఊసు లేకుండా హడావుడిగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. వడ్డీపై నియంత్రణ విధించే అధికారం రాష్ట్రానికి లేదని కేంద్రంలోని పెద్దలు వ్యాఖ్యానించారనే పేరుతో వడ్డీపై పరిమితిని విధించే అంశాన్ని ఇట్టే దాటవేసింది. వాస్తవానికి మైక్రో సంస్థలు 50 శాతం నుంచి 90 శాతం వరకూ వడ్డీ వసూలు చేస్తున్నాయి. ఇంత భారీ వడ్డీ రుచి మరిగినందునే కుప్పలు తెప్పలుగా మైక్రో సంస్థలు పుట్టుకొచ్చాయి. అయినా వడ్డీ పరిమితి తగ్గించే అంశాన్ని మాత్రం ఆర్డినెన్స్‌లో ప్రస్తావించకపోవడం విడ్డూరం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+