చంద్రబాబు తెలంగాణ వైఖరిపై తలలు పట్టుకుంటున్న నేతలు?

తమ పార్టీని తెలంగాణలో లేకుండా చేయాలని తెరాస అధ్యక్షుడు కెసిఆర్ ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు చాలా కాలంగా ధ్వజమెత్తుతున్నారు. అయితే, అసలు కారణం అది కాదని అంటున్నారు. తెలంగాణ విషయంపై చంద్రబాబు సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన నాయకులను రెచ్చగొట్టారని, ఏ ప్రాంతానికి చెందినవారు ఆ ప్రాంతానికి చెందిన గొంతు వినిపించాలని, తన పని తాను చేసుకుంటూ పోతానని చంద్రబాబు చెప్పారని అంటున్నారు. ఏ వైఖరి స్పష్టం చేయకుండా చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు తెలుగుదేశం నాయకులను కూడా ఇబ్బంది పెడుతోందని అంటున్నారు. తమ అసహనాన్ని వారు పార్టీలో వ్యక్తం చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. తెలంగాణ ప్రజల్లో చంద్రబాబుకు విశ్వాసం కుదరడం లేదని, పైగా తీవ్ర అవిశ్వాసం పేరుకుపోతోందని, చంద్రబాబు పర్యటననలకు ఆటంకాలు కలిగించడానికి ఇది ప్రధాన కారణమని పార్టీలే అంటున్నాయి.












Click it and Unblock the Notifications