తెలంగాణ కాంగ్రెసు లో మంత్రి గీతారెడ్డిని అణగదొక్కే యత్నాలు?

కొందరు తెలంగాణ కాంగ్రెసు నాయకులు మరికాస్త ముందుకు వెళ్లి గీతారెడ్డి సీమ కోడలు పరోక్షంగా అంటూ తెలంగాణలో ఆమె ప్రాధాన్యతను తగ్గించాలను చూస్తున్నారు. సీమ కోడలు, తెలంగాణ కూతురైన గీతారెడ్డి దళితురాలైనందునే అమెను ఎదగకుండా చేయాలని తెలంగాణ కాంగ్రెసు నాయకులు నిశ్చయించుకున్నారని వార్తను ప్రసారం చేసింది. సీమ కోడలు అయిన గీతారెడ్డి తెలంగాణకు అమె అనుకూలంగా లేదని కూడా తెలంగాణ కాంగ్రెసు నాయకులు పరోక్ష ప్రచారం చేస్తున్నట్టు వార్తా కథనాన్ని ప్రసారం చేసింది. కాగా పదవుల కోసం ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే వారికి దగ్గరవుతుంటుందనే కామెంటు కూడా గీతారెడ్డిపై ఉంది. ఇటీవల ఉప ముఖ్యమంత్రి పదవి కోసం దానం నాగేందర్, బొత్స సత్యనారాయణ, పొన్నాల లక్ష్మయ్య పేర్లతో పాటు గీతారెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చింది. దానిని తెలంగాణకు చెందిన కాంగ్రెసు నాయకులు జీర్ణించుకోలేకపేతున్నారు.












Click it and Unblock the Notifications