పరిటాల రవి అనుచరుడు పోతుల సురేష్ అరెస్టు కలకలం

Pothula Suresh and Paritala Ravi
అనంతపురం: హత్యకు గురైన తెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాల రవి అనుచరుడు పోతుల సురేష్ ను కిడ్నాప్ చేశారనే వార్తలతో శుక్రవారం తీవ్ర కలకలం చెలరేగింది. సూరత్ లోని ఉద్నాంలో అతన్ని కిడ్నాప్ చేసినట్లు తొలుత వార్తలు వచ్చాయి. పోతుల సురేష్ అదృశ్యంపై పోలీసులు ప్రకటన చేయాలని పౌర హక్కుల సంఘాలు డిమాండ్ చేశాయి. తన భర్తను పోలీసులే కిడ్నాప్ చేశారంటూ పోతుల సురేష్ భార్య సునీత ఆరోపించారు. ఈ నేపథ్యంలో పోతుల సురేష్ ను తామే అరెస్టు చేశామంటూ అనంతపురం జిల్లా పోలీసు సూపరింటిండెంట్ (ఎస్పీ) ఎన్ కె సిన్హా ప్రకటించారు. దీంతో వాతావరణం చల్లబడింది. అనంతపురం జిల్లాలో పోలీసులు అప్రమత్తమయ్యారు.

పోతుల సురేష్ ఏడేళ్లుగా అజ్ఞాతంలో ఉన్నాడు. పరిటాల రవి హత్య జరిగిన తర్వాత అతను కనిపించకుండా పోయాడు. మహబూబ్ నగర్ జిల్లా వావిలాల గ్రామానికి చెందిన పోతుల సురేష్ పరిటాల రవికి అత్యంత సన్నిహితుడు. అతను అంతకు ముందు ఆర్వోసిలో పనిచేశాడు. సురేష్ పై ఏడు హత్య కేసులు, 15 నాన్ బెయిలబుల్ కేసులు ఉన్నాయి. పోతుల సురేష్ ను సూరత్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రత్యేక పోలీసు బృందం రాష్టానికి తీసుకుని వస్తోంది. సురేష్ ను శనివారం సాయంత్రం కోర్టులో ప్రవేశపెడతామని సిన్హా చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+