నాపై తెలుగుదేశంలో కుట్ర చేసి ఎన్నికల్లో నన్ను ఓడించారు: రోజా

నా నియోజకవర్గాన్ని పార్టీ అధినేత చంద్రబాబునాయుడిని తిట్టిన గాలి ముద్దుకృష్ణమనాయుడికి ఇచ్చి గెలిపించారని ఆరోపించారు. తెలుగుదేశంలో ఉన్నప్పుడు చంద్రబాబుతో సహా అందరూ నన్ను పొడిగిన వారేనని గుర్తు చేశారు. సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డికి నామీద కడుపుమంట ఉన్నందువల్లే ఐరన్ లెగ్ అని అంటున్నాడని ధ్వజమెత్తింది. ప్రస్తుతానికి తాను ఏ పార్టీలో లేనని ఏ పార్టీలో చేరేది ఇంకా నిర్ణయించుకోలేదన్నది. తనకు ప్రాధాన్యమిచ్చే పార్టీలోకి వెళతానని అంటోంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పుయాత్ర ముగింపు సభలో పాల్గొనడంలో రాజకీయ కోణం లేదని ప్రకటించింది.












Click it and Unblock the Notifications