మహారాష్ట్ర సిఎం అశోక్ చవాన్ రాజీనామాను ఆమోదించిన సోనియా

ఆదర్శ్ కుంభకోణంలో అశోక్ చవాన్ పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. కార్గిల్ అమరవీరుల కుటుంబాలకు ఉద్దేశించిన ఫ్లాట్లలో తన అత్తకు ఫ్లాట్ ఇప్పించారని అశోక్ చవాన్ ఆరోపణలు ఎదుర్కున్నారు. దీంతో ఇటీవల అశోక్ చవాన్ ను సోనియా ఢిల్లీకి పిలిపించారు. చవాన్ తన రాజీనామా లేఖను సోనియాకు సమర్పించారు. వారం రోజుల క్రితమే సోనియా అశోక్ చవాన్ రాజీనామాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటన వల్ల చవాన్ తప్పుకోవడానికి కొంత గడువు ఇచ్చారు.












Click it and Unblock the Notifications