కెవిపి రామచందర్ రావుకు మంత్రి దానం నాగేందర్ కితాబు

రోశయ్య అనుభవమంత కూడా చంద్రబాబు వయస్సు లేదని ఆయన అన్నారు. రోశయ్య వయస్సే చంద్రబాబు ఆరోపణలకు సమాధానమని ఆయన అన్నారు. చంద్రబాబు తాను ఇంకా యువకుడినేనని అనుకుంటున్నారని, అందుకే ముఖ్యమంత్రి పదవి యువకులకు ఇవ్వాలని అంటున్నారని, తనకు 60 ఏళ్లు దాటిన విషయాన్ని చంద్రబాబు గమనించడం లేదని దానం నాగేందర్ అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు గాలి ముద్దు కృష్ణమ నాయుడికి మతి భ్రమించిందని, చంద్రబాబు వద్ద మార్కులు కొట్టేయడానికి రోశయ్యపై విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. గాలి ముద్దు కృష్ణమనాయుడికి కాంగ్రెసు ఉచితంగా చికిత్స చేయిస్తుందని ఆయన చెప్పారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీరు సిగ్గు చేటుగా ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications