వైయస్ జగన్ లోనే తెలుగు పౌరుషం ఉంది: లక్ష్మీపార్వతి ప్రశంస

ముఖ్యమంత్రి రోశయ్య సోనియా గాంధీ కాళ్ల వద్ద మోకరిల్లుతున్నారని, తెలుగు గౌరవాన్ని ఆమె వద్ద తాకట్టు పెడుతున్నారని లక్ష్మీపార్వతి విమర్శించారు. కాంగ్రెసు నాయకులు ఇందిరా గాంధీ వద్ద తెలుగు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నప్పుడు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారని ఆమె అన్నారు. ఎన్టీఆర్ మాదిరిగా ఆత్మగౌరవాన్ని ప్రదర్శిస్తూ, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి సోనియా వద్ద మోకరిల్లడానికి జగన్ నిరాకరిస్తున్నారని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications