ప్రియుడికోసం కన్న కొడుకుపైనే యాసిడ్ పోసి చంపిన కసాయి తల్లి

Kurnool District
కర్నుల్: ప్రియుడి కోసం కన్న కొడుకుపై యాసిడ్ పోసి చంపివేసిన దారుణమైన సంఘటన కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది. కర్నూల్లోని బుధవారంపేటలో ఉంటున్న లక్ష్మీదేవి తన భర్త నారాయణతో కొన్నాళ్ల క్రితం విడిపోయింది. భార్య ప్రవర్తన కారణంగా భర్తే దూరంగా ఉంటున్నాడు. అయితే తన కుమారుడిని తన దగ్గరే ఉంచుకుంది. సంవత్సరం క్రితం శ్రీనివాస్ రెడ్డి అనే డ్రైవర్ తో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తోంది. అయితే తమ అక్రమ సంబంధం ఎక్కడ బయట పెడుతాడోనని ఆమె మూడు రోజుల క్రితం తన కుమారుడిపై యాసిడ్ పోసింది. అనంతరం అమె స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లింది. మూడు రోజుల అనంతరం బుధవారం చికిత్స పొందుతూ ఆ బాలుడు మరణించాడు.

అయితే తాను తన కుమారుడిపై యాసిడ్ పోయలేదని, దీపావళి టపాకాయలు పేల్చుతుంటే ఆ మంటలు రేగి తనకు కాలాయని అంటూ అందరినీ బుకాయించే ప్రయత్నాలు చేస్తోంది. ఆసుపత్రిలో కూడా అదే కారణం చెప్పి బాలుడిని చేర్చింది. బంధువులు మాత్రం తల్లే యాసిడ్ పోసిందని ఆరోపిస్తున్నారు. తన అక్రమ సంబంధం బయట పడుతుందనే అనుమానంతో పాటు కొడుకును నిరంతరం తాను అక్రమ సంబంధం పెట్టుకున్న శ్రీనివాస రెడ్డిని తండ్రిగా పిలవాలని ఆమె పట్టుబట్టేదని స్థానికులు చెబుతున్నారు. కుమారుడు ఆరో తరగతి చదువుతున్నాడు. కాగా ప్రియుడు శ్రీనివాస్ రెడ్డి పరారీలో ఉన్నాడు. తండ్రి నారాయణకు ఇంకా ఈ విషయం తెలియదని అంటున్నారు.

గతంలో గుంటూరు జిల్లాలో నర్తనపైన, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఓ కుమారుడిని కన్నతల్లులే దాడి చేసిన సంఘటన అనంతరం ఇది వెలుగులోకి వచ్చింది. కన్నతల్లి అనే పదాన్ని కామంతో కళ్లుమూసుకుపోయిన తల్లులు మంట గలుపుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+