రోశయ్య సిఎం పదవికి ముప్పు: వ్యూహాత్మకంగా జగన్ ఓదార్పు వాయిదా?

Rosaiah
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి రోశయ్య గవర్నర్ గా నియామకం కాబోతున్నాడా అంటే అవునని, కాదని సమాధానం వస్తుంది. రోశయ్యను మధ్యప్రదేశ్ లేదా కర్ణాటక గవర్నర్ గా వెళ్లే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఆయన ఆరోగ్యం దృష్ట్యా, మరికొన్ని కారణాల దృష్ట్యా ఆయన్ను గవర్నర్ గా పంపించి మరొకరిని ముఖ్యమంత్రిగా నియమించాలనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు సమాచారం. ఈ విషయమై హైకమాండ్ నుండి బుధవారం టెలిగ్రాఫ్ పత్రికలో వార్తలు వచ్చినట్లు చెబుతున్నారు. ఫోన్ కాల్ కూడా వచ్చిందని సమాచారం. రోశయ్య కూడా రాజీనామాకు సిద్ధంగా ఉన్నట్టుగానే తెలుస్తుంది. రోశయ్యే తనకు తానే ముఖ్యమంత్రి పదవి నుండి తప్పుకునేందుకు అధిష్టానాన్ని కోరారని అంటున్నారు. ఈ విషయం దేశ రాజధాని ఢిల్లీలో గుప్పుమంటోంది.

అయితే జగన్ ఓదార్పు యాత్రను తట్టుకోవడం, ఆరోగ్య దృష్ట్యా రోశయ్యే తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్న సమయంలో కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి గీతారెడ్డి తదితరులు ముఖ్యమంత్రి రేసులు ఉన్నారు. అయితే జగన్ తన ఓదార్పు యాత్రను వాయిదా వేసుకోవడానికి ఏదైనా మతలబు ఉందా అనేది అర్థం కావటం లేదు. రోశయ్యను గవర్నర్ గా పంపే సమయంలో ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న వైయస్ జగన్ వ్యూహాత్మకంగానే ఓదార్పు యాత్రను వాయిదా వేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే అధిష్టానాన్ని ఇంతగా వ్యతిరేకించిన జగన్ కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశాలే లేవని కూడా మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. కేవలం వైయస్ అనుకోని మరణమే రోశయ్యను ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టామని హైకమాండ్ చెప్పింది. ఆ విషయాన్నే రోశయ్య కూడా పలుమార్లు చెప్పారు. అయితే రోశయ్యను గవర్నర్ పంపిస్తామని చెప్పటంతో కాంగ్రెసు లోని కొందరు ముఖ్యనేతలు ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి, భారీ నీటీ పారుదల శాఖా మంత్రి పొన్నాల లక్ష్మయ్య, బొత్స సత్యనారాయణ పేర్లు కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నాయి. అయితే తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో తెలంగాణ వారికే ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

ముఖ్యమంత్రి మార్పు వ్యవహారం నవంబర్ చివరి నాటికి కొలిక్కి రావచ్చునని సమాచారం. తాను ఆశక్తతను వ్యక్తం చేస్తూ రాజీనామాకు సిద్ధపడిన రోశయ్యను కొంత కాలం కొనసాగాల్సిందిగా పార్టీ అధిష్టానం సూచించినట్లు చెబుతున్నారు. అయితే, ముఖ్యమంత్రి మార్పుపై వస్తున్న వార్తలను ఢిల్లీలోని కాంగ్రెసు సీనియర్ నేతలు ఖండిస్తున్నారు. అవి నమ్మదగిన వార్తలు కావని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+