ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి కూల్చిన కుట్రలో రోశయ్య?

చంద్రబాబుపై రోశయ్య చేసిన విమర్శలకు యనమల రామకృష్ణుడు తీవ్రంగా ప్రతిస్పందించారు. రోశయ్యది బ్లాక్ మెయిల్ చరిత్ర అని ఆయన దుమ్మెత్తిపోశారు. ముఖ్యమంత్రులకు రోశయ్య అద్దె మైకుగా పని చేశారని ఆయన వ్యాఖ్యానించారు. అవినీతి నేతలకు కొమ్ము కాసిన శుక్రాచార్యుడిగా ఆయన రోశయ్యను అభివర్ణించారు. చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని ఆయన ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. రోశయ్యను ఆయన రాజకీయ వ్యభిచారిగా అభివర్ణించారు. చంద్రబాబుపై రోశయ్య చేసిన విమర్శలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తెలుగుదేశం నాయకులు రోశయ్యపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ నాయకులు పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications