వైయస్ జగన్ కు దక్కాల్సిన సిఎం పదవిని రోశయ్య కొట్టేశారా?

తమ పార్టీ నేత చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి రోశయ్యపై మరో తెలుగుదేశం నేత యనమల రామకృష్ణుడు విరుచుకుపడ్డారు. రోశయ్య రాజకీయ చరిత్ర గురించి చెప్పాల్సి వస్తే చాలా ఉందని ఆయన అన్నారు. రోశయ్య రాజకీయ వ్యభిచారి అని ఆయన వ్యాఖ్యానించారు. రోశయ్య తన 59 ఏళ్ల రాజకీయ చరిత్రలో చాలా ఘనకార్యాలు చేశారని ఆయన వ్యంగ్యంగా అన్నారు. ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాలని చంద్రబాబు కోరితే రోశయ్య దానికి సమాధానం చెప్పకుండా దాటేశారని, పైగా చంద్రబాబును నిందించారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications