నిండు సభ నుంచి ఎన్టీఆర్ ను గెంటేశారు: యనమలపై బొత్స సత్యనారాయణ

Botsa Satyanarayana
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య వ్యక్తిత్వాన్ని విమర్శిస్తూ మాట్లాడటం సరికాదని మంత్రి బొత్సా సత్యనారాయణ గురువారం అన్నారు. నిత్యం చంద్రబాబును పొగుడుతూ కాంగ్రెసు ను విమర్శించే తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడి చరిత్ర ఎవరికి తెలియదన్నారు. ఎన్టీఆర్ పై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేసిన కుట్రలో యనమల పాత్ర ఉందని ఆయన అన్నారు. నిండు సభలో తన వాదన వినిపించుకుంటానన్న ఎన్టీఆర్ ను అప్పుడు శాసనసభ స్పీకర్ గా ఉన్న యనమల రామకృష్ణుడు బయటకు గెంటేశారని ఆయన వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో ఏ మునిసిపాలిటీలో లేని విధంగా అత్యంత హేయంగా తుని మునిసిపాలిటీలో తెలుగుదేశం పార్టీ ఒక్క సీటును కూడా గెలుచుకోలేక పోయిందని విమర్శించారు. మునిసిపాలిటీలో ఒక్క సీటును గెలిపించుకోలేని యనమల ప్రభుత్వాన్ని, రోశయ్యను విమర్శించటం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో వరద సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. ప్రతిపక్షాలు కావాలనే వరదలను రాజకీయం చేస్తూ బురద రాజకీయాల్లో కూరుకు పోయాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగానే వరద సహాయక చర్యలు చేస్తున్నామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+