ఎన్టీఆర్ పై నాదెండ్ల కుట్రలో చంద్రబాబు పాలు పంచుకున్నారు: లక్ష్మిపార్వతి

బాలకృష్ణను తన వారసుడిగా ఎన్టీఆర్ ప్రకటిస్తే చంద్రబాబు ఖండించారని ఆమె గుర్తు చేశారు. ఎన్టీఆర్ కుమారులు చాలా మంచివాళ్లు, అమాయకులు అని ఆమె అన్నారు. చంద్రబాబుపై ఎన్టీఆర్ తనయులే తిరగబడాలని ఆమె అన్నారు. 1995 నుంచి పార్టీలో చంద్రబాబు కుట్ర చేస్తూ వచ్చారని, పార్టీలో సమర్థులైవారందరినీ కుట్రలు చేసి పంపించేశారని, తనకు అనుకూలమైనవారికి జిల్లా పార్టీ అధ్యక్ష పదవులు కట్టబెట్టారని ఆమె అన్నారు. చంద్రబాబు ఆస్తులు ఎంతో తేల్చాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. ఎన్టీఆర్ కు గానీ తనకు గానీ అస్తులు లేవని, చంద్రబాబు అవినీతి ద్వారా సంపద కూడబెట్టుకున్నారని ఆమె ఆరోపించారు.












Click it and Unblock the Notifications