2జి స్ప్రెక్టంలో రాజాను తొలగించాల్సిందే: చంద్రబాబు నాయుడు

Chandrababu Naidu
హైదరాబాద్: కాంగ్రెసు అధికారంలోకి వస్తే అవినీతి మాములు అయిపోయిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. చరిత్రను చూస్తే ఏ పార్టీలో లేని కుంభకోణాలు కాంగ్రెసు పార్టీ హయాంలో జరిగినట్లు మనకు స్పష్టమవుతాయని ఆయన అన్నారు. అవినీతి విషయంలో జాతీయస్థాయి చర్చ జరగాల్సిన అవసరం ఉందని, ఈ అవినీతిని ఆపకుంటే భారతదేశం పరువు ప్రపంచస్థాయిలో మంటగలిసి పోతుందని ఆయన అన్నారు. కేంద్ర మంత్రి రాజా 2జి స్పేక్ట్రంలో లక్షా డెబ్బయివేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డాడని కాగ్ స్పష్టమైన నివేధిక ఇచ్చినప్పటికీ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ నిమ్మకు నీరెత్తినట్లున్నారన్నారు. రాజాను వెంటనే మంత్రివర్గంనుండి తొలగించి ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆయన కాంగ్రెసు పార్టీని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై సోనియాగాంధీ స్పందించటం లేదని ఆయన ఆరోపించారు. ఆమెకు తెలియకుండా జరిగిన అవినీతి కాదు కాబట్టే ఆమె స్పందించటం లేదన్నారు. ఆదర్శ్, కామన్వెల్తు, వంతాడ, బయ్యారం, ఓఎంసి, బ్రాహ్మిణి వంటి భారీ కుంభకోణాలు జరుగుతున్న సోనియాగాంధీ, కాంగ్రెసు ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. ఆదర్శ్ కుంభకోణంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ను తప్పించి మరో ముఖ్యమంత్రిని కూర్చుండబెట్టడంతోనే తమ అవినీతి మాసిపోయినట్లు సోనియాగాంధీ భావిస్తోందన్నారు. కుంభకోణాలవల్ల ప్రజాధనం పూర్తిగా కాంగ్రెసు నాయకుల చేతుల్లోకి వెళుతోందన్నారు. ప్రజల సొమ్మును నిర్లజ్జగా దోచుకుంటున్న కాంగ్రెసు దోపీడిపై జాతీయస్థాయిలో చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టారు. దేశంలో జరుగుతున్న అవినీతికి బాధ్యత వహించేది ఎవరని చంద్రబాబు ప్రశ్నించారు. సోనియాగాంధీయా లేక ప్రధాని మన్మోహనా, మరెవరైనానా అని అడిగారు.

సోనియాగాందీ తనకు అనుకూలురైన వ్యక్తులను అధికారంలో కూర్చుండబెట్టుకొని రిమోట్ తన దగ్గర ఉంచుకొని దేశాన్ని గుప్పిట పట్టుకున్నదని విమర్శించారు. రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ కూడా సోనియా చేతిలో రిమోటేనన్నారు. ప్రధానమంత్రి మన్మోహన్ మౌనం, అసమర్థత దేశానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని చంద్రబాబు అన్నారు. ఆయనకు లీడరుషిప్ ఇవ్వకుండా సోనియాగాంధీ తానే అన్నింటికి లీడర్లా వ్యవహరిస్తోందన్నారు. ప్రతిభా పాటిల్ అయినా, మన్మోహన్ అయినా, రోశయ్య అయినా అధికారంలో ఎవరూ కూర్చున్నా రిమోట్ మాత్రం సోనియా చేతిలో ఉంటుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+