సుఖాంతమైన జీడిమెట్ల బాలుడు దేవదత్తా కిడ్నాప్

అయితే జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేశారు. యాదగిరిగుట్టలోని ఓ ప్రయివేటు లాడ్జిలో ఉన్నట్టు కనుగొన్నారు. లాడ్జి యజమానికి బాలుడిని కిడ్నాప్ చేసి తీసుకువచ్చినట్టు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించడంతో కిడ్నాప్ వ్యవహారానికి తెరపడింది. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. కిడ్నాప్ కు గురైన బాలుడు క్షేమంగానే ఉన్నాడు. కిడ్నాప్ చేసిన వ్యక్తుల్లో సంతోష్ అనే అతను పోలీసులకు దొరికిపోయాడు. మిగిలిన ముగ్గురు పరారయ్యారు. సంతోష్ ఇంతకుముందు శ్రీకాంత్ ఇంట్లో పని చేశాడు.












Click it and Unblock the Notifications