కె చంద్రశేఖర రావుకు తెలంగాణ ప్రజాఫ్రంట్ నేత గద్దర్ స్నేహ హస్తం

ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమకారులంతా కలిసిపోరాడాలని, ఉద్యమాలతోనే తెలంగాణ సాధ్యమని ఆయన ఉద్ఘాటించారు. బుధవారం కరీంనగర్‌లోని కళాభారతిలో తెలంగాణ ప్రజాఫ్రంట్‌కు మద్దతుగా జరిగిన అణగారిన ప్రజల హక్కుల పోరాట కమిటీ జిల్లా సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రజాఫ్రంట్ రాజకీయ పార్టీ కాదని, ఉద్యమకారులను కలుపుకొని, తెలంగాణ సాధనకు పోరాడే శక్తి అని పేర్కొన్నారు. విద్యార్థుల ఉద్యమాలతోనే డిసెంబర్‌లో ఢిల్లీ పాలకవర్గం కదిలిందన్నారు. డిసెంబర్ 9 చిదంబరం ప్రకటనలో మోసం ఉందని, చివరికి శ్రీకృష్ణ కమిటికీ వ్యవహారం మళ్ళిందన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణకు అనుకూలంగా రాదని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications