శ్రీకృష్ణ కమిటీని కొన్ని శక్తులు ప్రభావితం చేసే అవకాశాలు: కోదండరామ్

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావుతో తెలంగాణ ప్రజా ఫ్రంట్ వ్యవస్థాపక నాయకుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్ కలిసి పని చేస్తానని చెప్పడాన్ని కోదండరామ్ స్వాగతించారు. కేసిఆర్, గద్దర్ ఇద్దరూ తెలంగాణ కోసమే పని చేస్తున్నారని, కలిసి పనిచేస్తే మంచిదేనన్నారు. తెలంగాణ సాధన కోసం కేవలం గద్దర్, కేసిఆర్ కాదని తెలంగాణవాదులు అందరూ కలిసి రావాలని ఆయన కోరారు.
సుబ్బిరామిరెడ్డి విందుకు వెళ్లిన శ్రీకృష్ణ కమిటీ సభ్యుడు దుగ్గల్ ను వెంటనే కమిటీనుండి తొలగించాలని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు సిహెచ్ విద్యాసాగరరావు డిమాండ్ చేశారు. తెలంగాణపై వేసిన శ్రీకృష్ణ కమిటీ తెలంగాణకు అనుకూలంగా నివేదిక ఇస్తుందన్న నమ్మకం ప్రజలకు పోయిందన్నారు.












Click it and Unblock the Notifications