ఎన్టీఆర్ పై రామోజీరావు, చంద్రబాబు కుట్ర చేశారు: లక్ష్మీపార్వతి

1994 ఎన్నికలకు ముందు రామోజీరావు ఎన్టీఆర్ ను బద్దవిరోధిగా చూశారన్నరు. ఓ సమయంలో సారా వ్యతిరేకోద్యమం కోసం పోరాడుతున్న ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా రామోజీరావు కూడా సారా వ్యతిరేక ఉద్యమం పేరుతో జెండా పట్టుకొని ఊరూరా తిరుగారని గుర్తు చేశారు. 1994 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందని ఎన్టీఆర్ ను రామోజీరావు భయపెట్టాడని చెప్పారు. తమ రిపోర్టు ప్రకారం పార్టీ చిత్తుగా ఓడిపోతుందని, అనుకోని పరిస్థితుల్లో గెలిచినప్పటికీ రెండుమూడూ సీట్లతో గెలుస్తుందని, దాంతో రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం పతనం ఖావడం ఖాయమని రామోజీరావు ఎన్టీఆర్ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించారని, అయితే అందుకు విరుద్ధంగా తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించిందన్నారు. అప్పటినుండే రామోజీరావు, చంద్రబాబు కుమ్మక్కై ఎన్టీఆర్ ను తప్పించే ప్రయత్నం చేశారన్నారు. ఆ సమయంలోనే ప్రజల్లో ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా, చంద్రబాబు అనుకూలంగా ప్రచారం కోసం ఈనాడుకు తోడు ఈటీవి రావటం అందరూ గమనించాలని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications