ఎన్టీఆర్ బాబుపై బాలయ్యకు కూడా చెప్పారు: లక్ష్మిపార్వతి

ఎన్టీఆర్ మరణాంతరం తాను ఎన్టీఆర్ కుటుంబానికి దగ్గర కావడానికి ప్రయత్నించానని, వారిని తన కుటుంబ సభ్యులుగానే చూస్తూ వచ్చానని ఆమె చెప్పారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను తాను ఎప్పుడు కూడా విమర్శించలేదని ఆమె అన్నారు. చంద్రబాబును, దగ్గుబాటిని తాను పార్టీకి ఉపయోగపడతారని, వారిని దూరం చేసుకోకూడదని భావించానని ఆమె అన్నారు. అమాయకుడైన బాలయ్య చేత ఎన్టీఆర్ తో పెళ్లి కాలేదని అనిపించాడని ఆమె అన్నారు. ఎన్టీఆర్ ను దించేటప్పుడు చంద్రబాబు వెంట 30 మంది శాసనసభ్యులు మాత్రమే ఉన్నారని, ఎన్నికలకు ముందు నుంచే ఎన్టీఆర్ పై చంద్రబాబు కుట్ర చేస్తూ వచ్చారని ఆమె అన్నారు. చంద్రబాబు తనను దుష్టశక్తిగా, సైతాన్ గా అభివర్ణించి క్షోభ పెట్టారని ఆమె అన్నారు. మొదటి నుంచి ముఖ్యమంత్రి పదివిపై కన్నేసిన మాట నిజం కాదా అని ఆమె అడిగారు.












Click it and Unblock the Notifications