చంద్రబాబుపై, తెలుగుదేశం నేతలపై విరుచుకుపడిన మంత్రులు

Chandrababu Naidu
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. రోశయ్యపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై, ఆ పార్టీ నాయకులపై రాష్ట్ర మంత్రులు విరుచుకుపడ్డారు. చంద్రబాబు మానసిక పరిస్థితి బాగా లేదని తెలుగుదేశం నాయకులే చెబుతున్నారని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద రావు అన్నారు. తెలుగుదేశం నాయకులకు రోశయ్యను విమర్శించే స్థాయి లేదని ఆయన అన్నారు. 2009 ఎన్నికల్లో ఓడిపోయినా చంద్రబాబుకు జ్ఞానోదయం కాలేదని ఆయన అన్నారు. తెలుగుదేశం నాయకులను విమర్శిస్తే తన స్థాయిని తగ్గించుకోవడమే అవుతుందని మంత్రి మాణిక్యవరప్రసాద రావు అన్నారు. రోశయ్యకు వ్యభిచారం చేసే వయస్సు లేదని మరో మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి అన్నారు.

చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా సమర్థంగా పనిచేయడంలో విఫలమయ్యారని మాణిక్యవరప్రసాద్ అన్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించడంలో తెలుగుదేశం పార్టీ విఫలమైందని ఆయన అన్నారు. ఏం మాట్లాడాలో కూడా చంద్రబాబుకు తెలియడం లేదని, ఏం మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటారో తెలియడం లేదని, ప్రజలు అసహ్యించుకునేలా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబులా వెన్నుపోటు పొడవడం కాంగ్రెసుకు తెలియదని ఆయన అన్నారు.

తెలుగుదేశం నాయకుల మాదిరిగా మాట్లాడితే తమ స్థాయి తగ్గినట్లు అవుతుందని మంత్రులు అన్నారు. చంద్రబాబు మెప్పు కోసం తెలుగుదేశం నాయకులు మాట్లాడుతున్నారని వారన్నారు. పదవి కోసం యనమల రామకృష్ణుడు లక్ష్మీపార్వతి కాళ్లు మొక్కారని వారన్నారు. ముఖ్యమంత్రి పదవి నుంచి రోశయ్యను తప్పిస్తున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని వారన్నారు. రోశయ్య సమర్థంగా పని చేస్తున్నారని వారు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+