హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో స్పో ర్ట్స్ మన్ రంజన్ గల్లంతు
Districts
oi-Srinivas G
By Srinivas
హైదరాబాద్: రాజధాని హైదరాబాదులో ఓ వాటర్ స్పోర్ట్సుమెన్ నగరం నడిబొడ్డున ఉన్న హుసేన్ సాగర్ లో గల్లంతయ్యాడు. గురువారం ఉదయం రంజన్ అనే వాటర్ స్పోర్ట్సుమెన్ ప్రాక్టీసు కోసం హుసేన్ సాగర్ కు వచ్చాడు. ట్రెయినంగ్ బోటులో వెళ్లి ప్రాక్టీసు చేస్తున్నాడు. అయితే ప్రాక్టీసుకు సాగర్లోకి వెళ్లిన రంజన్ ఒక్కసారిగా కనిపించకుండా పోయాడు. 11 గంటలకు ఆయన కనిపించకుండా పోయాడు. అధికారులు వెంటనే ఆయన్ను వెతకడానికి సహాయక బృందాలను రంగంలోకి దించారు. రంజన్ కోసం సాగర్లో అంత గాలిస్తున్నారు.