మూసుకున్న తలుపులు: చిరంజీవితోనే వంగవీటి రాధాకృష్ణ

కాంగ్రెసు విజయవాడ సెంట్రల్ శాసనసభ్యుడు మల్లాది విష్ణు వంగవీటి రాధాకృష్ణను పార్టీలోకి తీసుకోవడానికి ఏ మాత్రం సుముఖంగా లేరని సమాచారం. వంగవీటి రాధాకృష్ణ తండ్రి వంగవీటి రంగాకు మల్లాది విష్ణు కుడిభుజంగా పనిచేశారు. అదే సమయంలో రంగాకు డ్రైవర్ గా కూడా పనిచేశారు. అయినా పార్టీలోకి రాకుండా ఆయన రాధాను అడ్డుకున్నట్లు తెలుస్తోంది. బొండా ఉమామహేశ్వర రావు తెలుగుదేశంలోకి రాధా రాకుండా అడ్డుకున్నట్లు సమాచారం. విజయవాడలో తెలుగుదేశం పార్టీకి ప్రధాన కాపు నాయకుడు బొండా ఉమామహేశ్వర రావు ఒక్కరే. అందువల్ల ఉమామహేశ్వర రావు మాటను కాదని రాధాను తెలుగుదేశం పార్టీ నాయకత్వం తీసుకునే పరిస్థితి లేదని అంటున్నారు.












Click it and Unblock the Notifications