మారిన చంద్రబాబు రూటు: వైయస్ జగన్ నుంచి రోశయ్య వైపు

Chandrababu Naidu
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. రోశయ్య పట్ల మెతగ్గా వ్యవహరిస్తూ కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పై విమర్శలు ఎక్కుపెడుతూ వచ్చిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు రూటు మార్చారు. రోశయ్యపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. చంద్రబాబుకు, రోశయ్యకు మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందనే ప్రచారం గతంలో జరిగింది. ఆ స్థాయిలో రోశయ్య పట్ల చంద్రబాబు మెతగ్గా వ్యవహరిస్తూ వచ్చారు. మరో వైపు వైయస్ జగన్ పై, వైయస్సార్ కుటుంబ సభ్యులపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేస్తూ వచ్చారు. తెలుగుదేశం నాయకులు కొంత కాలం వరుసగా వైయస్ జగన్ పై విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. ఇప్పుడు తెలుగుదేశం నాయకులు రోశయ్యను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు. రోశయ్య పట్ల చంద్రబాబు కరుకు వైఖరి ప్రదర్శించడానికి కారణాలు లేకపోలేదు.

తనకు, రోశయ్యకు మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందనే ప్రచారాన్ని తిప్పి కొట్టడం చంద్రబాబు ప్రథమ లక్ష్యంగా కనిపిస్తుంది. వైయస్ జగన్ పై తాము చేస్తున్న ఆరోపణల వల్ల రోశయ్య లబ్ధి పొందుతున్నారని చంద్రబాబు చాలా ఆలస్యంగా గుర్తించారు. జగన్ పై తాము ఆరోపణలు చేస్తుండడం వల్ల వాటిని పార్టీ అధిష్టానానికి చూపిస్తూ తన పీఠాన్ని పదిలపరుచుకునేందుకు రోశయ్య ప్రయత్నించారని చంద్రబాబు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. జగన్ ను బలహీన పరుస్తూ కాంగ్రెసులో ఆయన వ్యతిరేక వర్గాన్ని బలోపేతం చేయడానికి తమ వ్యూహం పనికి వస్తోందనే విషయాన్ని గ్రహించి తన దృష్టిని చంద్రబాబు రోశయ్య వైపు మళ్లించినట్లు చెబుతున్నారు.

రోశయ్య తమ పట్ల అంత సానుకూలంగా లేరనే విషయాన్ని కూడా చంద్రబాబు గ్రహించారని అంటున్నారు. తాము వినతిపత్రం ఇవ్వడానికి ప్రధాని అపాయింట్ మెంటు ఇప్పించకపోగా, తమను అరెస్టు చేయించి తమపై రోశయ్య తీవ్ర విమర్శలు చేయడం కూడా ఆయనకు నచ్చలేదు. దానికి తోడు, కాంగ్రెసు అధిష్టానం తమ పార్టీని బలహీనపరచడానికి చేస్తున్న ప్రయత్నాలు కూడా ఆయన ఆగ్రహం తెప్పించినట్లు తెలుస్తోంది. దీంతోనే రోశయ్యపై తెలుగుదేశం పార్టీ నాయకులు దాడికి దిగుతున్నట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+