సిఎం పదవి కోసమే కె.చంద్రశేఖర రావుతో కేశవరావు భేటీ?

K Keshav Rao
న్యూఢిల్లీ: కాంగ్రెసు తెలంగాణ సీనియర్ నేత కె. కేశవరావు ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఢిల్లీలో ఈ మేరకు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ముఖ్యమంత్రి పీఠం కోసం సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డిని ముందుకు తోస్తుండగా దాన్ని తిప్పికొడుతూ తాను ఆ పీఠంపై కూర్చునేందుకు కేశవరావు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావుతో సమావేశం కూడా ఇందులో భాగమేననే ప్రచారం జరుగుతోంది. జైపాల్ రెడ్డి ముఖ్యమంత్రిగా రావడం కెసిఆర్ కు ఇష్టం లేదని, జైపాల్ రెడ్డి అవకాశాలను దెబ్బ తీస్తూ కేశవరావును ముఖ్యమంత్రి కుర్చీ కోసం ముందుకు తోయడం కెసిఆర్ అభిమతంగా చెబుతున్నారు.

ముఖ్యమంత్రిని త్వరలో మారుస్తారన్న వార్తల నేపథ్యంలో సదరు కేంద్ర మంత్రి కదలికలను పసిగట్టిన కేకే, తన అవకాశాలను కూడా మెరుగు పరుచుకునేందుకు యథాశక్తి ప్రయత్నిస్తున్నట్టు చెబుతున్నారు. డిసెంబర్లో శ్రీకృష్ణ కమిటీ నివేదిక అనంతరం రాష్ట్రంలో సంభవించబోయే పరిణామాలను సమర్థంగా ఎదుర్కోవడానికి టీఆర్‌ఎస్‌ను ఎలాగోలా కట్టడి చేయగలిగిన సామర్థ్యం కొత్త సీఎంకు ఉండాలన్నది కాంగ్రెస్ అధిష్టానం అభిమతంగా చెబుతున్నారు. కాబట్టి టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో తనకున్న సన్నిహిత సంబంధాలు ఈ విషయంలో ఎంతోకొంత కలిసొస్తాయని కేకే అంచనా వేస్తున్నారు.

రెండు సార్లు, మూడున్నర గంటల పాటు జరిపిన సుదీర్ఘ భేటీలో కేకే తన మనోగతాన్ని బయట పెట్టడంతో పాటు తన సీఎం అభ్యర్థిత్వానికి మద్దతివ్వాల్సిందిగా కేశవరావు కేసీఆర్‌ను కోరారని, తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానాన్ని పూర్తి సానుకూలంగా మార్చితే సహకరిస్తానని ఆయన చెప్పారని అంటున్నారు. తెలంగాణకు సానుకూలంగా అధిష్టానం నిర్ణయం తీసుకునేలా కేకే వంటి కాంగ్రెస్ నేతల సాయంతో అట్నుంచి నరుక్కొచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే కేకే ప్రతిపాదనకు సుముఖంగా స్పందించారని ఢిల్లీ రాజకీయ వర్గాల సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+