కెసిఆర్ మాటలను వక్రీకరించారు: టిడిపిపై నిప్పులు చెరిగిన కెటిఆర్

KT Rama Rao
హైదరాబాద్: తన తండ్రి, తమ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు మాటలను తెలుగుదేశం పార్టీ నాయకులు వక్రీకరిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు కెటి రామారావు విమర్శించారు. కాంగ్రెసును ఇబ్బంది పెట్టకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామనే ఉద్దేశంతో కాంగ్రెసును బలోపేతం చేస్తామని కెసిఆర్ అన్నారని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కాంగ్రెసులో చేరుతారా అని మీడియా ప్రతినిధులు అడిగితే తాను జ్యోతిష్కుడిని కానని, ఇప్పుడు మాత్రం కాంగ్రెసును బలోపేతం చేస్తామని కెసిఆర్ చెప్పినట్లు ఆయన వివరణ ఇచ్చారు.

ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా కాంగ్రెసు అధికారంలో ఉందని, ఆ పార్టీని ఇరకాటంలో పెట్టకుండా సహకరించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాల్సి ఉంటుందని, అదే ఉద్దేశంతో కెసిఆర్ మాట్లాడారని ఆయన అన్నారు. కాంగ్రెసు నేతృత్వంలోని ప్రభుత్వం ద్వారా బిల్లు పెట్టించి తెలంగాణను సాధించుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చర్యలు తీసుకోకపోతే కాంగ్రెసును కూడా వదిలిపెట్టబోమని కెసిఆర్ స్పష్టంగా చెప్పారని, జనవరి చివరి వరకు కేంద్ర ప్రభుత్వానికి గడువు ఇస్తామని కూడా చెప్పారని, ఆ మాటలను పట్టించుకోకుండా కెసిఆర్ మాటలను వక్రీకరిస్తున్నారని ఆయన అన్నారు.

తెలుగుదేశం పార్టీ నాయకులు తమ పార్టీని చక్కదిద్దుకోలేక తమపై విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. టిడిపిని తెలివి లేని దద్దమ్మల పార్టీగా ఆయన అభివర్ణించారు. తెలంగాణపై చిత్తుశుద్ధి ఉంటే తాము తెలంగాణకు కట్టుబడి ఉన్నామని తెలుగుదేశం నాయకులు వారి అధ్యక్షుడు చంద్రబాబు చేత ప్రకటన ఇప్పించాలని ఆయన సవాల్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+