కెసిఆర్ కాంగ్రెసుతో కలిసినట్లు నటిస్తున్నారు: శైలజానాథ్

కెసిఆర్ తీరును తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెసు సీనియర్ శాననసభ్యుడు పి. శంకరరావు కూడా వ్యతిరేకించారు. తెలంగాణపై కెసిఆర్ కు చిత్తశుద్ధి లేదని ఆయన విడిగా మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ప్రత్యేక రాష్ట్రంపై కెసిఆర్ రోజుకో మాట మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెసు పార్టీని బలోపేతం చేయడానికి కెసిఆర్ ఎవరని ఆయన అడిగారు. తెలంగాణ ఇచ్చిందని కెసిఆర్ ఇది వరకే చెప్పి ఉంటే విద్యార్థుల ఆత్మహత్యలు ఆగి ఉండేవని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications