గొనె ప్రకాశరావును హన్మకొండలో అడ్డుకున్న తెలంగాణవాదులు

తెరాస కార్యకర్తల తీరుపై గోనె ప్రకాశ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం తాను ఆత్మార్పణ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు. కెసిఆర్ తెలంగాణ ఉద్యమాన్ని తన కుటుంబ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆయన అన్నారు. ఫిబ్రవరిలో పార్లమెంటు ముందు ఆత్మార్పణ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని, తనతో పాటు కెసిఆర్ ఇద్దరు శాసనసభ్యులను పంపాలని, నాలుగో వ్యక్తిని తన కూతురునో, కుమారుడినో, అల్లుడినో, నాయని నర్సింహారెడ్డినో పంపాలని ఆయన అన్నారు. ఈ విషయంపై మాట్లాడడానికి తాను కెసిఆర్ ఇంటికి కూడా వస్తానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications