హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబును కలిసిన పోతుల సురేష్ భార్య సునీత

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: హైదరాబాదులోని చర్లపల్లి జైలులో ఉన్న పరిటాల రవి అనుచరుడు పోతుల సురేష్ భార్య పోతుల సునీత శనివారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని కలిశారు. తన భర్తకు ప్రాణహాని ఉందని ఆమె చంద్రబాబుకు చెప్పుకున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తన భర్తకు తగిన భద్రత కల్పించేలా చూడాలని ఆమె చంద్రబాబును కోరారు. ప్రత్యర్థుల నుంచి తన భర్తకు ప్రాణహాని ఉందని ఆమె చెప్పుకున్నారు.

పలు కేసుల్లో నిందితుడైన పోతుల సురేష్ ను అనంతపురం పోలీసులు ఇటీవల గుజరాత్ లోని సూరత్ లో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. పోతుల సురేష్ కు కోర్టు రిమాండ్ విధించింది. అనంతపురం జైలులో భద్రత కల్పించలేమని అక్కడి అధికారులు చేతులెత్తేయడంతో పోతుల సురేష్ ను చర్లపల్లి జైలుకు తరలించారు. పరిటాల రవి హత్య తర్వాత సురేష్ అజ్ఞాతంలోకి వెళ్లారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X