కాంగ్రెసును బలోపేతం చేయడానికి కెసిఆర్ డీల్ ఎంత: నామా నాగేశ్వర రావు

Nama Nageswara Rao
హైదరాబాద్: కాంగ్రెసును బలోపేతం చేయడానికి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రసశేఖర రావు కుదుర్చుకున్న డీల్ ఎంత అని ఖమ్మం జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావు ప్రశ్నించారు. కెసిఆర్ పై తెలుగుదేశం నాయకులు శనివారం కూడా తీవ్రంగా ధ్వజమెత్తారు. తమ పార్టీని, తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును విమర్శిస్తే ఖబడ్దార్ అని ఆయన కెసిఆర్ ను హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని కెసిఆర్ ఎంత వాటా దక్కించుకున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కెసిఆర్ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. నిరుడు డిసెంబర్ 9వ తేదీ ప్రకటనను తానే రాసిచ్చానని అంటున్న కెసిఆర్ శ్రీకృష్ణ కమిటీ నివేదికను కూడా రాసిస్తారా అని ఆయన ఎద్దేవా చేశారు.

తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ నాగా జనార్దన్ రెడ్డి మరోసారి కెసిఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాటలు మార్చడంలో కెసిఆర్ దిట్ట అని ఆయన అన్నారు. కాంగ్రెసు తెలంగాణ ఇస్తే ఎందుకు తెచ్చుకోలేదని ఆయన అడిగారు. తెలంగాణకు వ్యతిరేకమని తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చెప్తే ప్రజలు ఏది చెప్తే అది చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. తెరాస బలహీనపడినప్పుడు ప్రాణం పోసింది తమ పార్టీయేనని, తెలంగాణకు తమ పార్టీ మద్దతిచ్చిందని ఆయన అన్నారు. కెసిఆర్ మాటల వెనక ఫ్యామిలీ బెనిఫిట్ ఉందని సీమాంధ్రకు చెందిన తెలుగుదేశ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.

కాంగ్రెసు, తెరాస కలిసి తమ రాజకీయ వ్యవహారాన్ని అమలు చేస్తున్నాయని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సమావేశం అభిప్రాయపడింది. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పోలిట్ బ్యూరో సమావేశానంతరం పార్టీ నాయకుడు ఎర్రంనాయుడు మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర మంత్రి రాజాను తప్పించాలని ఆయన ప్రధాని మన్మోహన్ సింగ్ ను డిమాండ్ చేశారు. స్పెక్ట్రమ్ కుంభకోణంపై సిబిఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ధర్నాలో పాల్గొన్న ముఖ్యమంత్రి కె. రోశయ్యపై ఎందుకు కేసు పెట్టలేదని ఆయన అడిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+