నాగం జనార్దన్ రెడ్డిని పార్టీ నుంచి గెంటేస్తానని చంద్రబాబు బెదిరించారా?

తమ ప్రాంతంవారికి అన్యాయం జరుగుతుంటే మాట్లాడకూడదా అని తెలంగాణ ప్రాంత నాయకులు అడుగుతుంటే నేను చెప్తే వినరా అంటూ చంద్రబాబు తిట్లు తిట్టారని వ్యాఖ్యానించింది. తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించే నాయకులను తమ చెమ్చాలు దేవేందర్ గౌడ్, నామా నాగేశ్వరరావులను అడ్డం పెట్టుకుని చంద్రబాబు పార్టీలో అణచివేస్తున్నారని విమర్సించింది. రెండు కళ్ల సిద్ధాంతం పేరుతో చంద్రబాబు తెలంగాణ పట్ల వివక్ష ప్రదర్సిస్తున్నారని, తమ సమైక్యవాద బుద్ధిని ప్రదర్శిస్తున్నారని వ్యాఖ్యానించింది. పార్టీలోని సీమాంధ్ర నాయకులు కాంగ్రెసు నాయకుడు లగడపాటి రాజగోపాల్ తో అఖిల పక్ష సమావేశాలు పెట్టినా, నన్నపనేని రాజకుమారి లగడపాటిని ముద్దు పెట్టుకున్నా చంద్రబాబు ఏమీ అనరని, తెలంగాణ నాయకులను మాత్రమే అదుపు చేయాలని చూస్తున్నారని అభిప్రాయపడింది.












Click it and Unblock the Notifications