ఫ్రీజోన్ పై హోంమంత్రి చిదంబరాన్ని కలిసిన తెలంగాణ కాంగ్రెసు ఎంపీలు

చిదంబరానికి వినతి పత్రం ఇచ్చిన అనంతరం ఎంపీలు ఆయనతో కాసేపు భేటీ ఆయ్యారు. ఫ్రీజోన్ వివాదంపై ఆయనకు వివరించారు. తెలంగాణ ప్రాంతం నుండి 12 మంది కాంగ్రెసు పార్లమెంటు సభ్యులం ఉన్నప్పటికి తెలంగాణకు సరియైన న్యాయం జరగటం లేదని వారు చిదంబరానికి విన్నవించుకున్నారు. వారు చెప్పిన విషయాన్ని చిదంబరం సావదానంగా విన్నట్టు సమాచారం.












Click it and Unblock the Notifications