సంగీత, నృత్య కళాశాలలో లగడపాటి మాంసాహార విందుపై వివాదం

అయితే ఈ విషయంపై కళాశాల ప్రిన్సిపాల్ మునికుమార్ స్పందించారు. వారు మాంసాహారం పెడతారని తనకు తెలియదని, తాను నాన్ వెజ్ వండుకోవడానికి అనుమతి ఇవ్వలేదన్నారు. పవిత్రమైన తమ కళాశాలలో మాంసాహారం వండటాన్ని ఖండిస్తున్నట్టు చెప్పాడు. అయితే అంత పెద్ద మొత్తంలో విందు ఏర్పాటు చేసినప్పుడు తమకు సమాచారం తెలియదని మునికుమార్ అనటం గమనార్హం. సంగీత కళాశాలలో మాంసాహరం పెట్టడాన్ని పలువురు సంగీతాభిమానులు ఖండించారు. ఈ విందు ఒక ప్రజాప్రతినిధి ఇవ్వడం, చాలామంది ప్రజాప్రతినిధులు ఇందులో పాల్గొనడం సిగ్గు చేటన్నారు. అధికారం చేతిలో ఉందనే ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారన్నారు. దీంతో వారికి ఘంటసాలపై ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందన్నారు. ఇకముందు ఇలాంటి చర్యలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
అయితే సంగీత కళాకారులు మాంసాహారులా, శాఖాహారులా అనేది సమస్య కాదని కొందరు వాదిస్తున్నారు. హైందవ దేవాలయాలలో అయితే దీనిని తప్పుబట్టువచ్చు కాని సంగీత కళాశాలలో మాంసాహారం పెట్టడాన్ని తప్పుగా భావించరాదని కొందరు అంటున్నారు. ముఖ్యమంత్రి రోశయ్య ఉపేంద్ర విగ్రహాన్ని కశాశాల వెలుపల ఆవిష్కరించి ప్రసంగించారు. విందుకు మాత్రం ఆయన హాజరు కాలేదు.












Click it and Unblock the Notifications